యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కి చాన్స్ ఇచ్చిన బాలయ్య .!

Balakrishna
‘శ్రీమన్నారాయణ’ సినిమా తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ చిన్ని కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించారు. ఈ సంవత్సరం ‘ఈ రోజుల్లో’, ‘బస్ స్టాప్’ సినిమాల ద్వారా తెలుగువారికి దగ్గరైన యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జె.బి మ్యూజిక్ నచ్చి ఈ సినిమాకి మ్యూజిక్ చేసే అవకాశం బాలయ్య చాన్స్ ఇచ్చారు. ఇంతకీ ఎవరా మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటున్నారా? ఇప్పటికే ఈ సినిమా కోసం జె.బి ఓ సాంగ్ రికార్డ్ చేసారని సమాచారం. బాలకృష్ణ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమాని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నాడు. 2013లో సెట్స్ పైకి వెళ్ళే ఈ సినిమా వివరాలు జనవరిలో అధికారికంగా తెలియజేసే అవకాశం ఉంది.

Exit mobile version