‘ప్రేమ కావాలి’ సినిమా ద్వారా హిట్ అందుకుని తెరకి పరిచయమైన యంగ్ హీరో ఆది పుట్టిన రోజు ఈ రోజు. ఆదికి ఈ బర్త్ డే చాలా స్పెషల్ ఎందుకంటే ఆది హీరోగా, సి.హెచ్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కనున్న ఓ కొత్త సినిమా లాంచనంగా ఈ రోజు హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, డైరెక్టర్ వి.వి వినాయక్, టి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు కె.సి.ఆర్ ముఖ్య అతిధిలుగా హాజరయ్యారు. రియల్ స్టార్ శ్రీ హరి కీలక పాత్ర పోషిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి మణిశర్మ సంగీతం అందిస్తుండగా, కె.కె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. 123తెలుగు.కామ్ తరపున ఆదికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, బర్త్ డే స్పెషల్ గా ప్రారంభమైన సినిమా విజయం సాధించాలని కోరుకుందాం.