యంగ్ హీరో శర్వానంద్ హీరోగా రానున్న ‘కో అంటే కోటి’ సినిమా త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆడియో ప్లాటినం డిస్క్ వేడుక ఘనంగా ఈ రోజు హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో జరగనుంది. ఈ రోజు సాయంత్రం టాలీవుడ్ & బాలీవుడ్ స్టార్స్ క్రికెట్ మ్యాచ్ జరగనుంది, ఈ మ్యాచ్ బ్రేక్ టైంలో ‘కో అంటే కోటి’ ప్లాటినం డిస్క్ వేడుక జరపనున్నారు. శర్వానంద్, ప్రియ ఆనంద్ జంటగా నటించిన ఈ సినిమాలో శ్రీ హరి కీలక పాత్ర పోషించాడు.
శర్వా ఆర్ట్స్ బ్యానర్ పై శర్వానంద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిష్ కురువిల్ల డైరెక్టర్. శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించిన పాటలకు మంచి ఆదరణ లబిస్తోంది. క్రైమ్ – కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి రాకేష్ – నవీన్ సినిమాటోగ్రాఫర్స్.