ఈ ఏడాది ఊహించని విధంగా కబళించిన అతిధి కరోనా వైరస్. ప్రపంచ దేశాలను వణికించిన ఈ ప్రమాదకారి వైరస్ మన దేశాన్ని కూడా ఎంతగానో కుదిపేసింది. అయితే ఈ ప్రమాదకర పరిస్థితుల్లో మాత్రం దేశమంతటా ఒక ఆపద్భాంధవుడిగా నిలిచాడు. ప్రముఖ నటుడు సోనూ సూద్. మన తెలుగు సహా అనేక భాషల్లో నటిస్తున్న ఈ నటుడు విలన్ గా మాత్రమే తెలుసు.
కానీ ఈ కరోనా కష్ట కాలంలో సోను నిజమైన నిస్సహాయులకు ఎంతటి సాయం చేయడానికి కూడా వెనుకాడకుండా రీల్ లైఫ్ లో విలన్ అయినప్పటికీ రియల్ లైఫ్ లో మాత్రం హీరోగా నిలిచాడు. దీనితో ప్రతీ ఒక్క భారతీయుని గౌరవాన్ని సోనూ దక్కించుకున్నాడు. కానీ ఇదే కరోనా పరిస్థితులలో ఒక విషయం మాత్రం సోనూను బాగా బాధ పెట్టిందట.
“ఈ కోవిడ్ లో ధనవంతులు మరింత ధనవంతులు అయ్యారు. పవర్ ఫుల్ వ్యక్తులు మరింత పవర్ ఫుల్ అయ్యారు, పేదలు..మరింత నిరుపేదలయ్యారు. ఇదేం బాలేదు” అంటూ సోనూ సూద్ ట్వీట్ చేసారు. ఈ విషయంలో మాత్రం సోనూ బాగా హర్ట్ అయ్యినట్టు అనిపిస్తుంది. అందుకే సమాజం పట్ల తన మనసులో ఉన్న మాటను ఏమాత్రం సంకోచం లేకుండా చెప్పేసారు.
In COVID :
Rich became RICHER.
Powerful became more Powerful.
Poor became Poorer.
Not fair.
— sonu sood (@SonuSood) October 10, 2020