ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళితో “RRR” అనే భారీ పీరియాడిక్ అండ్ మల్టీ స్టారర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే మోస్ట్ పవర్ ఫుల్ ప్రాజెక్ట్ అంటే ఇక దీని తర్వాత కూడా తారక్ మరో పవర్ ఫుల్ కాంబో ను సెట్ చేసుకున్నారు. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఒక ప్రాజెక్ట్ ను ఓకె చేసారు.
దీనితో ఈ కాంబో ఎప్పుడు మొదలవుతుందా అని తారక్ అభిమానులు విపరీతంగా ఎదురు చూస్తున్నారు. తన కేజీయఫ్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ కు ఒక పవర్ ఫుల్ సినిమాను పరిచయం చేసిన ఈ దర్శకుడు తారక్ ఫ్యాన్స్ తో మాత్రం భలే టచ్ లో ఉన్నారని చెప్పాలి. ప్రస్తుతం తాను తెరకెక్కిస్తున్న “కేజీయఫ్ చాప్టర్ 2” షూట్ లో బిజీగా ఉంటూనే షూట్ కు సంబంధించిన అప్డేట్స్ ను అందిస్తున్నారు.
అలా తాము హైదరాబాద్ లో కూడా షూట్ చేస్తామని తెలుపగా తారక్ అభిమాని అలా వచ్చినపుడు ఒకసారి కాల్ చేస్తే తారక్ అన్న ఇంటికి స్టోరీ డిస్కస్ చెయ్యడానికి వెళదామని అనగా అందుకు నీల్ నీ నెంబర్ ఇవ్వడం మర్చిపోయావ్ అంటూ ఊహించని విధంగా రిప్లై ఇచ్చి మిగతా తారక్ అభిమానులకు మంచి కిక్కిచ్చారు. మొత్తానికి మాత్రం ఈ కాంబో కోసం యుంగ్ టైగర్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
https://twitter.com/prashanth_neel/status/1314466541333749761?s=20