ప్రపంచంలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో ఏదన్నా ఉంది అంటే అది “బిగ్ బాస్” షో అనే చెప్పాలి. ఇతర ఎంటర్టైనింగ్ షోలతో పోలిస్తే తక్కువ రోజుల వ్యవధే ఉన్నప్పటికీ కాస్త కొత్త కాన్సెప్ట్ కావడంతో మన దగ్గర కూడా అన్ని భాషల్లోనూ భారీ హిట్ గా నిలిచి ప్రతీ సీజన్లో దూసుకుపోతుంది. అయితే ఈ షోను ఎంతలా ఫాలో అయ్యేవారు ఉన్నారో ప్రతీది అబ్జర్వ్ చేస్తూ షో ఎలా నడుస్తుంది అని చూసే నెటిజన్స్ కూడా ఉండనే ఉన్నారు.
అయితే ఈ షోను ఇపుడు బాయ్ కాట్ చెయ్యాలని నెటిజన్స్ అంటున్నారు. అయితే అది మన తెలుగు ప్రేక్షకులు కాదు బాలీవుడ్ ప్రేక్షకులు నినదిస్తున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్న ఈ షో ఇటీవలే 14వ సీజన్ మొదలు పెట్టుకుంది. ఇంకా 10 ఎపిసోడ్స్ కూడా పూర్తి కాకముందే హిందీ జనం ఈ షో మాకొద్దని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఇందుకు గట్టి కారణమే ఉంది.
మామూలుగా బిగ్ బాస్ షో అంటేనే ఫ్యామిలీ ఆడియెన్స్ తో కలిసి కూర్చొని చూసే షో కానీ ఈ సీజన్ తాలుకా ఎపిసోడ్ 4 లేటెస్ట్ ప్రోమో చూసేసరికి షో వీక్షకులు సహా నెటిజన్స్ పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఈ ప్రోమో పూర్తిగా అడల్ట్ కంటెంట్ తో నిండిపోయి ఉంది. దీనితో షో వారు టీఆర్పీలు లేక ఇలా చేస్తున్నారని. ఈ షో కూడా పలు పార్న్ కంటెంట్ అందించే స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లా తయారయ్యిందని సోషల్ మీడియాలో #boycottbb14 అనే హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.