నాని ‘టక్’ బిగించేశాడు

ఇటీవలే ‘వి’ సినిమాతో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల్ని పలకరిచారు నాని. మొదటిసారి ఆయన్ను నెగెటివ్ పాత్రలో చూసి ప్రేక్షకులు థ్రిల్ అయ్యారు. ఇక ఈసారి నేరుగా థియేటర్లలోనే ప్రేక్షకుల్ని పలకరించడానికి సన్నద్దమవుతున్నారాయన. ఆయన చేస్తున్న కొత్త చిత్రం ‘టక్ జగదీష్’ చిత్రీకరణ నిన్నటి నుండి మొదలైంది. ఈరోజు నుండి నాని కూడ పద్దతిగా టక్ చేసుకుని షూటింగ్లో పాల్గొంటున్నారు. లాక్ డౌన్ వలన సినిమా ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అందుకే మిగిలిన సగం చిత్రీకరణను వేగంగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు టీమ్.

లేటెస్ట్ అప్డేట్ మేరకు నవంబర్ చివరికల్లా షూటింగ్ ముగించి సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీమ్ భావిస్తున్నారట. ఇకపోతే ఇందులో అన్నదమ్ముల మధ్యన ఉండే ఎమోషన్స్ కీలకంగా ఉంటాయని, నాని సోదరుడి పాత్రలో సీనియర్ నటుడు నటిస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఈ చిత్రాన్ని నిర్మించిన సాహు గారపాటి, హరీష్ పెద్దిలు నిర్మిస్తున్నారు. ఇందులో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా కనిపించనున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తమన్ బాణీలు సమకూరుస్తున్నారు.

Exit mobile version