యంగ్ టైగర్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బాద్షా’ ప్రస్తుతం హైదరాబాదులో షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న టీంతో పాటుగా నవదీప్ కూడా జత కలిసాడు. నవదీప్ ఈ సినిమాలో నెగటివ్ పాత్ర పోషిస్తున్నాడు. శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. బృందావనం తరువాత మళ్లీ వీరిద్దరు కలిసి నటిస్తున్న చిత్రం ఇది. ఎన్టీఆర్ డాన్ తరహా పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మానందం కీలక పాత్రా ప్లే చేస్తున్నాడు. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవి విడుదల కాబోతుంది.