బన్నీ నుండి మరో ఫుల్ యాక్షన్ సినిమా!

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకి మరో బంపర్ ఆఫర్ తగిలిందట. బన్నీ సుకుమార్, కొరటాల సినిమాల తరువాత బోయపాటితో ఓ ఫుల్ యాక్షన్ సినిమా చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం సుకుమార్ తో చేస్తోన్న పుష్ప సినిమా ఓ పజిల్ లాగా స్క్రీన్ ప్లే సాగుతుంది. అందుకే కేవలం మాస్ జనం కోసమని.. తన తరువాత సినిమాని బోయపాటితో ప్లాన్ చేస్తున్నాడు బన్నీ. పైగా వీరిద్దరిది హిట్ కాంబినేషన్ కూడా.

అయితే బోయపాటి, రామ్ చరణ్ తో చేసిన ‘వినయ విధేయ రామ’ చిత్రం ప్లాప్ తరువాత మరో సినిమా రావడానికి చాల గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది, నిజానికి ఆ సినిమా ప్లాప్ అవ్వడానికి ప్రధాన కారణం సినిమాలోని యాక్షనే. అందుకే ఈ క్రమంలో బోయపాటి, నందమూరి బాలకృష్ణతో చేస్తోన్న సినిమాలో కూడా యాక్షన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కాస్త నమ్మే విధంగా రియలిస్టిక్ యాక్షన్ తోనే ఇక నుండి తన సినిమాలు తీయాలని బోయపాటి బలంగా డిసైడ్ అయ్యాడు. ఏమైనా బోయపాటికి బన్నీ లాంటి హీరో చాన్స్ ఇవ్వడం అంటే కచ్చితంగా అది విశేషమే.

Exit mobile version