“RRR” విషయంలో రాజమౌళిది గ్రేట్ విజన్.!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి ఇద్దరు పవర్ ఫుల్ మాస్ హీరోలకు అంతే స్థాయి మాస్ దర్శకుడు తోడైతే ఎలా ఉంటుందో ఇప్పటికే మనం చూసేసాం. కానీ అంచనాలకు మించి ఈ ఇద్దరి హీరోల కలయికలో రాజమౌళి కాంబో అన్నది ఇప్పటికీ ఒక సెన్సేషనల్ వర్డ్ గా వినిపిస్తుంది. అలాంటి ఈ ముగ్గురి కలయికలో ఒక పీరియాడిక్ డ్రామాను తెరకెక్కిస్తుండడం ఆ అంచనాలను ఇంకెక్కడో నిలిపింది.

అయితే ఈ సినిమాలో ఒక చిన్న కీలక పాత్ర పోషిస్తున్న శ్రేయ శరన్ చేసిన కొన్ని కామెంట్స్ బయటకు వాచినట్టు తెలుస్తుంది. తన ఇంతకు ముందు “ఛత్రపతి” లో నటించి ఇప్పుడు RRR కు పని చేస్తున్నానని ఈ సినిమా విషయంలో రాజమౌళి కి గ్రేట్ విజన్ ఉందని అలాగే ఈ చిత్రాన్ని రాజమౌళి చాలా డిఫరెంట్ గా తెరకెక్కిస్తున్నారని తెలిపారు. ఈ చిత్రం మళ్ళీ షూట్ మొదలయ్యి విడుదల కోసం తాను కూడా ఎదురు చూస్తున్నానని తెలిపింది. ఇప్పటికే ఈ చిత్రంపై తారా స్థాయి అంచనాలు ఉన్నాయి. మరి ఈ చిత్రం ఎప్పుడు విడుదల కానుందో చూడాలి.

Exit mobile version