ఎట్టి పరిస్థితుల్లో ప్రభాస్ నుంచి సాలిడ్ ట్రీట్.?

ఇప్పుడు మన ఇండియాలోనే టాక్ ఆఫ్ ది స్టార్ హీరోగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నిలుస్తున్నాడు. వరుసబెట్టి భారీ ప్రాజెక్టులను లైన్ లో పెడుతూ తన పాన్ ఇండియన్ స్టార్డం ను అలా మైంటైన్ చేస్తూ వస్తున్నాడు. అయితే ప్రభాస్ లైన్ లో పెట్టినటువంటి వరుస మూడు ప్రాజెక్టులు ఒకదానిని మించేలా మరొకటి ఉన్నాయి. వీటిలో రాధే శ్యామ్ మరియు ఆదిపురుష్ చిత్రాలు కు సంబంధించి చిత్ర యూనిట్ ఎప్పుడు ఏదొక సమాచారాన్ని అందిస్తున్నారు.

అయినప్పటికీ ప్రభాస్ మరియు నాగశ్విన్ ల ప్రాజెక్ట్ అంటేనే ప్రభాస్ అభిమానులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదిలా ఉండగా వచ్చే 2021లో రాధే శ్యామ్ విడుదల పక్కాగా ఉండనుండగా వచ్చే ఆ వచ్చే ఏడాది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నాగశ్విన్ తో తీస్తున్న స్కై ఫై థ్రిల్లర్ అలాగే ఓం రౌత్ తో తీస్తున్న పీరియాడిక్ డ్రామాను విడుదల చేసేయాలని ఆలోచనలో ఉన్నారట. ఈ లెక్కన ప్రభాస్ నుంచి ఒకపక్క సాలిడ్ ట్రీట్ తో పాటుగా బాక్సాఫీస్ బొనాంజా కూడా అదే ఏడాదిలో డబుల్ రేంజ్ లో ఉంటుందని చెప్పాలి.

Exit mobile version