ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించనున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. అయితే ఈ లాక్ డౌన్ మూలాన ఎన్నో చిత్రాల షూట్ కు భారీ దెబ్బ పడింది. అలానే ఇప్పుడు ఈ చిత్రం షూట్ కూడా కొన్నాళ్ళు ఆగిపోవాల్సి వచ్చింది. ఇక మళ్ళీ షూట్ కు రెడీ అవుతున్నారు అన్న సందర్భంలో ఈ చిత్రం షూటింగ్ మళ్ళీ వాయిదా పడినట్టు తెలుస్తుంది.
ఈ చిత్రం అత్యధిక శాతం అడవుల్లో చిత్రీకరించాల్సి ఉంది కావున కొన్ని రోజుల అనంతరం కేరళ అడవుల్లో షూట్ ప్లాన్ చెయ్యగా అది కాస్తా ఇపుడు ఆగిపోయిందట. దీనితో ఇపుడు సుకుమార్ మళ్ళీ ప్లాన్స్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. అలా ఇపుడు తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం షూట్ డిసెంబర్ చివర నుంచి మొదలు కానున్నట్టు టాక్ వినిపిస్తుంది. అలాగే ముందు ప్లానింగ్ ప్రకారమే సింగిల్ షెడ్యూల్ లోనే అనుకున్న షూట్ ను పూర్తి చేసేయాలని అనుకుంటున్నారట. మరి ఈ కష్ట కాలం ఎప్పుడు తొలగుతుందో చూడాలి.