ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించనున్న “ఆదిపురుష్” చిత్రానికి సంబంధించి అనేక రకాల స్పెక్యులేషన్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రాన్ని దర్శకుడు ఓం రౌత్ మన దేశంలోనే భారీ విజువల్ ఎఫెక్ట్స్ కలిగిన చిత్రంగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే ఆ ప్రోగ్రెస్ లో కూడా పడ్డారు. అయితే ఈ సినిమాకు సంబంధించి మరో కీలక పాత్ర అయినటువంటి సీతాదేవి రోల్ పై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. అలాంటి రావణుని పాత్రకే తొందరగా ఒక పేరు దొరికేసినా సీతాదేవి పాత్రకు మాత్రం అనేక పేర్లు వినిపిస్తున్నాయి.
మొదట్లో కీర్తి సురేష్ మరియు కియారా అద్వానీల పేర్లు వినిపించగా ఇప్పుడు ఇద్దరు అనుష్కల పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ కాగా మరొకరు ప్రభాస్ మరియు ఫిల్మీ లవర్స్ ఆల్ టైం హిట్ పెయిర్ అనుష్క శెట్టి. ఏఈ ఇద్దరి పేర్లే ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. మరి ఈ ఇద్దరిలో ఎవరి పేరు ఖరారు అవుతుందో చూడాలి.