“బాహుబలి”ని తలదన్నేలా “ఆదిపురుష్”..?


మన ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలు వచ్చాయి. అలాగే ఎన్నో భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న గ్రాండియర్ సినిమాలు కూడా వచ్చాయి. అన్ని ముఖ్య భాషల ఇండస్ట్రీల నుంచి కూడా భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న సినిమాలను మనం చూసాము. కానీ విజువల్ ఎఫెక్ట్స్ మరియు వాటి వసూళ్ల పరంగా మాత్రం ఇప్పటి వరకు ఇండియాలోనే ఆల్ టైం నెంబర్ 1 గా మన తెలుగు “బాహుబలి” సిరీస్ నిలిచింది.

దర్శక ధీరుడు రాజమౌళి చాలా కేర్ తీసుకొని ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ తో మాహిస్మతి అనే కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు ఇదే చిత్రాన్ని తలదన్నే భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఫ్రేమింగ్ తో అదే సినిమా హీరో ప్రభాస్ నటించనున్న బై లాంగువల్ చిత్రం “ఆదిపురుష్”లో పెట్టనున్నట్టు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న లేటెస్ట్ టాక్.

ఇంతకు ముందే దర్శకుడు ఓంరౌత్ ఆదిపురుష్ ను విఎఫ్ఎక్స్ కు పెద్ద పీఠ వేస్తూ ఎక్కువ పార్ట్ ను వాటితోనే తెరకెక్కించనున్నారని చెప్పుకున్నాం. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రం బాహుబలి కంటే ఎక్కువ విఎఫ్ఎక్స్ షాట్స్ తో తీయనున్నారట. దీనితో బాహుబలి కంటే బెటర్ విజువల్ అవుట్ ఫుట్ వస్తుందని తెలుస్తుంది. మరి ఈ ఇతిహాస గాథ మన ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఎలాంటి విజువల్ ట్రీట్ ను అందిస్తుందో చూడాలి.

Exit mobile version