“RRR” మేకర్స్ కు కొత్త ఛాలెంజ్..నిజమేనా?


మన తెలుగు ఇండస్ట్రీ నుంచి బాహుబలి తర్వాత మొత్తం ఇండియా వైడ్ ఇంపాక్ట్ కలిగిన భారీ ప్రాజెక్ట్ “RRR”. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ దర్శక ధీరుడు రాజమౌళి ప్లాన్ చేసిన ఈ పీరియాడిక్ వండర్ కోసం సినీ ప్రేక్షకులు భారీ ఎత్తున ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది లాక్ డౌన్ వల్ల షూటింగులు నిలిచిపోవడంతో ఈ సినిమా కూడా ఆగిపోవాల్సి వచ్చింది.

ఇప్పుడు ఎలాగో షూటింగ్ మళ్ళీ మొదలు కానుంది అని టాక్ వినిపిస్తుండగా అప్పటి వరకు అధికారికంగా ఎలాంటి అప్డేట్స్ రావని ఖరారు అయ్యింది.ఇదిలా ఉండగా ఈ చిత్ర యూనిట్ కు ఇప్పటికే చాలా ఛాలెంజ్ లు ఎదురయ్యాయి.అలా ఇప్పుడు మరో ఫ్రెష్ ఛాలెంజ్ వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ చిత్రాన్ని నిర్మాత డివివి దానయ్య దాదాపు 400 కోట్లకు పైగానే భారీ వ్యయంతో తెరకెక్కించనున్నట్టు తెలిసిందే. కానీ ఇప్పుడు వీరికి సరికొత్త ఛాలెంజ్ ఎదురవ్వనున్నట్టు తెలుస్తుంది.

ఇప్పుడు ఈ చిత్రానికి అదనంగా మరో వందకోట్లు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అది కూడా ఈ కోవిడ్ పరిస్థితుల వల్లనే పెరిగినట్టు టాక్. కొమరం భీం గా తారక్, అలలుగా చరణ్ కనిపించనున్న ఈ ప్రాజెక్ట్ కు ఎం ఎం కీరవాణి గారు సంగీతం అందిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి.

Exit mobile version