యంగ్ అండ్ టాలెంటెడ్ హీరి సందీప్ కిషన్ మరొకసారి నిర్మాతగా మారారు. ఇప్పటికే వివాహ భోజనంబు అంటూ హైదరాబాద్ లాంటి నగరంలో మాత్రమే కాక తెలుగు ప్రేక్షకులకు వివాహ భోజనంబు రుచి చూపించారు. అయితే ఇదే టైటిల్ తో ఒక చిత్రాన్ని నిర్మించేందుకు సందీప్ సిద్దం అయ్యారు. ఇప్పటికే నిను వీడని నీడను నేనే సినిమాను నిర్మించి ప్రేక్షకులను అలరించారు. ఈ చిత్రం తో నే వెంకటాద్రి టాకీస్ అంటూ ఒక నిర్మాణ సంస్థ ను స్థాపించారు సందీప్. అయితే ఏ1 ఎక్స్ ప్రెస్ అంటూ మరొక చిత్రం లో నటిస్తున్న సందీప్, ఈ చిత్రానికి సహ నిర్మాత గా కూడా వ్యవహరిస్తున్నారు సందీప్.
అయితే ప్రొడక్షన్ నంబర్ 2 గా ఏ1 ఎక్స్ ప్రెస్ ను తెరకెక్కిస్తూనే, ప్రొడక్షన్ నంబర్ 3 కి సిద్దం అయ్యారు. వెంకటాద్రి టాకీస్ మరియు సోల్జర్స్ ఫ్యాక్టరీ పతాకాల పై ఈ చిత్రం రూపొందనుంది. అంతేకాక ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై పి. కిరణ్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. సోమవారం నాడు విడుదల అయిన ఈ చిత్రం ప్రీ లుక్ ప్రేక్షకుల ను అలరిస్తుంది. అయితే ఈ చిత్రం ఫస్ట్ లుక్ తో పాటు హీరో, హీరోయిన్, ఇతర నటీనటుల వివరాల్ని త్వరలో చిత్ర యూనిట్ వెల్లడించనుంది.