కరోనా ఎఫెక్ట్.. వారణాసి సీక్వెన్స్ తీసేశారట !

కరోనా మహమ్మారి దెబ్బకు దేశవ్యాప్తంగా సినీ లోకం స్తంభించిపోయింది. ఇప్పటికే చిత్రనిర్మాతలు ఈ సంవత్సరం మొత్త్తం అవుట్ డోర్ షెడ్యూల్స్ ను మరియు విదేశీ షెడ్యూల్‌లను రద్దు చేసుకున్నారు. అయితే బాలయ్య – బోయపాటి సినిమాలో ఓ ముఖ్యమైన సీక్వెన్స్ ను వారణాసి మరియు హిమాలయాలలో విస్తృతంగా షూట్ చేయాల్సి ఉంది. స్టూడియోల్లో సెట్ వేయడం సాధ్యం కాదు. అక్కడ షూట్ చేయలేరు. దాంతో ఈ వారణాసి సీక్వెన్స్ ను స్క్రిప్ట్ నుండి తీసేశారని తెలుస్తోంది.

మొత్తానికి కరోనా ఎఫెక్ట్ తో బాలయ్య సినిమాలో మార్పులు చేయాల్సి వస్తోంది. ఇక ఈ సినిమాలో యంగ్ హీరో నవీన్ చంద్ర ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడట. నవీన్ చంద్ర, ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నామని.. ఇప్పటికే ఇద్దరిని షార్ట్ లిస్ట్ చేసామని.. సరైన టైమ్ లో వాళ్లలో ఒకరిని హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నామని బోయపాటి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

Exit mobile version