తన రాబోతున్న చిత్ర చిత్రీకరణ ప్రారంభ తేదీని దర్శకుడు హరీష్ శంకర్ దృవీకరించారు. యాంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న హరీష్ శంకర్ ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం గురించి ఈరోజు ట్విట్టర్లో ” జనవరి 3 నుండి 15 వరకు చిత్ర మొదటి షెడ్యూల్ జరుగుతుంది.ఎన్టీఆర్ తో పని చెయ్యడం చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు. అయన చిత్రం కోసం “బాద్షా” చిత్రీకరణ తేదీలలో మార్పు చేసినందుకు దర్శకుడు శ్రీను వైట్ల మరియు బండ్ల గణేష్ లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ మరియు సమంతలు ప్రధాన పాత్రలలో రానున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.