ఆ సినిమాతో నేను మారాను – వర్మ

rgv
‘శివ’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ స్థితిని గతిని మార్చిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఇండస్ట్రీలోని మార్పు గురించి చెప్పాలంటే ‘శివ’ సినిమా ముందు ‘శివ’ సినిమా తర్వాత అని సంబోదిస్తారు అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు వర్మ ఎంతలా ఇండస్ట్రీని మార్చాడనేది. కానీ వర్మ గురించి బయట అడిగితే కొందరు వాడికి పొగరు అంటారు, కొందరేమో వాడికి కొంచెం తిక్క అంటారు, కొందరేమో మంచి డైరెక్టర్ కానీ అప్పుడప్పుడు సినిమాలు పిచ్చి పిచ్చిగా తీస్తాడు అంటారు, మరికొందరైతే వర్మ జీనియస్ అంటారు. ఇవన్నీ ఎలా ఉన్నా వర్మ మాత్రం ఎవరేమనుకుంటే నాకేంటి నేను చెయ్యాలనుకున్నది చేస్తా అంటూ ముక్కు సూటిగా పోయే వ్యక్తి. అలాంటి వర్మ ఇప్పుడు నేను మారాను అంటున్నాడు. ఇంతకీ వర్మని మార్చిన విషయం ఏంటో చూద్దాం..

’26/11 షూటింగ్ డిసెంబర్ 11తో పూర్తయ్యింది. నేను షూటింగ్ చేస్తున్న సమయంలో వాళ్ళు దాడి చేసిన సీన్స్ తీస్తుంటే నాకే భయంకరంగా అనిపించాయి. అదే రియల్ గా వాళ్ళు చేసిన ఘోరాన్ని ఊహించుకోవడమే నా వల్ల కావడం లేదు. 26/11 సినిమా నన్ను ఒక మనిషిగా మార్చింది. ఈ సినిమా వాళ్ళ నేను మనిషిలోని మంచిని మరియు క్రూరత్వాన్ని అర్థం చేసుకోగలిగానని’ వర్మ సోషల్ నెట్వర్కింగ్ సైట్లో తెలిపారు. దీన్ని బట్టి చూస్తుంటే 26/11 ముంబై దాడులు వర్మని తీవ్రమైన బాధకి గురిచేసినట్టు ఉన్నాయి.

Exit mobile version