ఎన్.టి.ఆర్ బాద్షా డబ్బింగ్ పూజ ఈరోజే


యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బాద్షా’ సినిమా డబ్బింగ్ పూజా కార్యక్రమాలు ఈ రోజు జరిగాయి. ఈ రోజు నుంచి డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు కానున్నాయి. షూటింగ్ తో పాటు డబ్బింగ్ కూడా ఒకే సమయంలో జరగనుంది. ఎన్.టి.ఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడా శ్రీను వైట్ల బ్రాండ్ మార్క్ తో కూడిన ఎంటర్టైన్మెంట్ మరియు కామెడీ ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. ప్రముఖ కథా రచయితలు గోపి మోహన్ మరియు కోన వెంకట్ ఈ సినిమాకి కథ, డైలాగ్స్ అందించారు.

ఎన్.టి.ఆర్ ఈ సినిమాలో కొత్త లుక్ మరియు కొత్త రకమైన పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్ర టీం యూరప్, బ్యాంకాక్ షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ‘బాద్షా’ ని సమ్మర్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పై బండ్ల గణేష్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version