ఒక నెల క్రితం లేదా అంతకంటే ముందు నుంచి ఆర్ ఆర్ మూవీ మేకర్స్ వారు తీవ్రమైన ఫైనాన్సియల్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అలాగే ‘ఢమరుకం’ మూవీ విడుదల విషయంలో సినీ అభిమానులు వారిపై తీవ్ర ఒత్తిడిని పెంచారు. ఇందంతా జరిగిన తర్వాత చివరికి ఈ సినిమా నవంబర్ 23 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆర్.ఆర్ మూవీ మేకర్స్ వారు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా ‘కింగ్’ నాగార్జున కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నమోదైంది.
ఆర్.ఆర్ మూవీ మేకర్స్ ఇవ్వాల్సిన అప్పుల వలన మన రాష్టంలో తక్కువ మొత్తానికే డిస్ట్రిబ్యూటర్స్ కొనుక్కున్నారు. సినిమాకి వచ్చిన రెస్పాన్స్ తో వాళ్ళు పెట్టిన దాని కంటే ఎక్కువనే సంపాదించుకున్నారు. ఇది భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఆర్.ఆర్ మూవీ మేకర్స్ వారికి కొంత లాస్ వచ్చింది. కానీ వారి అప్పులు చాలా వరకు తొలగిపోవడంతో ఆర్.ఆర్ మూవీ మేకర్స్ వారు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.