సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గురించి తెలియని సినీ అభిమానులు ఉండరు. ఆయన పాటలు ఎంత బాగా ఇస్తారో నేపధ్య సంగీతం అంతకంటే బాగా ఇస్తారు. నేపధ్య సంగీతం విషయంలో అయన ఎంతో కేర్ తీసుకుని చేస్తారు. సినిమాకి నేపధ్య సంగీతం ఎంత కీలకం అనేది అయనకి బాగా తెలుసు. కేవలం నేపధ్య సంగీతం అందించి హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ప్రేమించుకుందాం రా, లక్ష్మి, చింతకాయల రవి, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓ మై ఫ్రెండ్ లాంటి కొన్ని సినిమాలకు నేపధ్య సంగీతం అందించాడు. వెంకటేష్, మహేష్ బాబు కలిసి నటిస్తున్న మల్టిస్టారర్ సినిమా “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”కి నేపధ్య సంగీతం అందించబోతున్నాడు అని సమాచారం. మహేష్ బాబు సినిమాలకి ఆస్థాన సంగీత దర్శకుడిగా పేరున్న మణిశర్మ ఈ సినిమాకి కూడా అదిరిపోయే సంగీతం ఇస్తాడని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.