అత్యధికంగా డౌన్ లోడ్ చెయ్యబడ్డ సౌత్ ఇండియన్ సెలబ్రిటీ గా త్రిష


ప్రస్తుతం రేస్ లో లేని కథానాయిక అయినా త్రిష అభిమానుల్లో అభిమానం తగ్గలేదని త్రిష నిరూపించింది. సమంత,కాజల్,నయనతార మరియు తమన్నా వంటి హీరొయిన్ లను పక్కకు నెట్టి మొబైల్స్ లో అత్యధికంగా డౌన్ లోడ్ చెయ్యబడ్డ దక్షిణ భారత సెలబ్రిటీ గా పేరొందింది. ఎయిర్ టెల్ మోబిట్యుడ్ 2012 నిర్వహించిన సర్వేలో ఈ చెన్నై సుందరి షారుఖ్ ఖాన్ మరియు సల్మాన్ ఖాన్ వంటి తారలను సైతం వెనక్కి నెట్టింది. యువత ఆమె వాల్ పేపర్స్ మరియు పోస్టర్స్ ఎక్కువగా డౌన్ లోడ్ చేస్తుండటం ఆమెకు ఈ గౌరవాన్ని తెచ్చి పెట్టింది. ఈ విషయాన్ని త్రిష ట్విట్టర్లో వెల్లడిస్తూ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version