మెగాస్టార్ చిరంజీవి నటుడిగా ఎంతో ఎత్తుకి ఎదిగాడు. అశేష ప్రేక్షకాదరణ పొందిన అగ్ర హీరోగా చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చిన తరువాత సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. మెగాస్టార్ గురించి ప్రస్తుత జనరేషన్ వారికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కానీ నెక్స్ట్ జనరేషన్ వారు ఆయన గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు ‘మెగా చిరంజీవితం’ అనే పుస్తకం రాసాడు. ఈ పుస్తక ఆవిష్కరణ ప్రసాద్ ల్యాబ్లో జరిగింది. ఈ వేడుకకి అక్కినేని నాగేశ్వర రావు, ఏడిద నాగేశ్వర రావు, అల్లు అరవింద్, రామ్ చరణ్, కే.ఎస్ రామారావు విచ్చేసారు. ఈ వేడుకలో అక్కినేని నాగేశ్వర రావు మాట్లాడుతూ చిరంజీవి ఎలాంటి సపోర్ట్ లేకుండా తన స్వయం కృషిని నమ్ముకొని చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ అయ్యాడు. ఈ రోజుల్లో ప్రముఖుల గురించి తెలుసుకోవడానికి పుస్తకాలు వస్తున్నాయి. చిరంజీవి గురించి తెలుసుకోవడానికి ఈ తరం వారికి పుస్తకాలు అవసరం లేదు కానీ తరువాతి తరం వారికి ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు. రామ్ చరణ్ మాట్లాడుతూ తన ఆటో బయోగ్రఫీ గురించి రాయమని మా నాన్న గారిని చాలాసార్లు అడిగాను. ఆయన ఆసక్తి చ్పించే వారు కాదు. కొంత మంది ఆయన మీద బుక్ రాస్తామని అడిగారు కానీ నాన్న గారు అంగీకరించలేదు. నాన్న గురించి బాగా తెలిసిన పసుపులేటి రామారావు గారు ఇలా బుక్ రాయడం చాలా ఆనందంగా ఉంది.