తెలుగులో పాపులర్ సింగర్స్ అయిన హేమ చంద్ర – శ్రావణ భార్గవిలు పెళ్లి చేసుకోబోతున్నారని అధికారికంగా ప్రకటించారు. నిన్న వీరిద్దరికీ హైదరాబాద్లో నిశ్చితార్ధం జరిగింది. వీరిద్దరి వివాహ మహోత్సవం ప్రేమికుల రోజు అనగా ఫిబ్రవరి 14న జరగనుంది. ఇటీవల కాలంలో వచ్చిన పెద్ద సినిమాలన్నింటిలోనూ వీరు పాటలు పాడారు, ఉదాహరణకి ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’, ‘దేనికైనా రెడీ’, ‘రెబల్’ మరియు ‘కృష్ణం వందే జగద్గురుమ్’ మొదలైనవి. గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్న వీళ్ళిద్దరూ త్వరలోనే ఒకటి కానున్నారు. గతంలో ఇదే విధంగా సింగర్స్ అయిన గోపికా పూర్ణిమ – మల్లికార్జున్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ఈ నూతన జంటకు 123 తెలుగు.కామ్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.