
ఈ సినిమాకి ‘అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్’ టైటిల్ అని నిర్మాత చెప్పినపుడు సెట్ కాదేమో మరీ ఓల్డ్ గా ఉంది అనుకున్న. కానీ టైటిల్ అనౌన్స్ చేసాక వస్తున్న రేస్పోన్స్ చూస్తుంటే ఆనందంగా ఉంది అంటున్నాడు చిత్ర హీరో వరుణ్ సందేశ్. ఈ సినిమా వివరాలు చెప్పడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాలో హరి ప్రియనే. ఆమె ఈ సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తుంది. ఒక పాట మినహా షూటింగ్ పూర్తయిందని నిర్మాత కేదారి లక్ష్మణ్ తెలిపారు. ఒక క్లాస్ అబ్బాయికి ఒక మాస్ అమ్మాయికి మధ్య ఎం జరిగిందని మా సినిమా కథ అంటున్నాడు చిత్ర దర్శకుడు కోనేరు శ్రీను.