ప్రభాస్ ఖాతాలో మరో గ్రేట్ అచీవ్మెంట్.!

అందరి డార్లింగ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఇప్పుడు ఉన్న క్రేజ్ అనన్య సామాన్యం. యాక్టర్ గా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు మన తెలుగు నుంచి మొట్ట మొదటి పాన్ ఇండియన్ హీరోగా మారి మరింత స్టార్డం ను తెచ్చుకున్నాడు. ఒక్క మన భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో సైతం మంచి క్రేజ్ ను సంతరించుకున్న ప్రభాస్ ఖాతాలో ఇప్పుడు మరో గ్రేట్ అచీవ్మెంట్ వచ్చి పడింది అని డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

దీనికి బలమైన కారణం కూడా లేకపోలేదు. ప్రభాస్ బాహుబలి లాంటి సినిమా చేసినంత వరకు కూడా ఎలాంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో లేరు. ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ లో లక్షాలది ఫాలోవర్స్ ఉన్న హ్యాండిల్స్ ను ఫ్యాన్సే మైంటైన్ చేస్తూ వచ్చారు. అలా ఇప్పుడు మన ఇండియన్ సెలెబ్రెటీస్ లో ట్విట్టర్ నుంచి సజెస్ట్ చేయబడుతున్న టాపిక్స్ లో ప్రభాస్ పేరును కూడా ఇప్పుడు అందుబాటులో ఉంచడం జరిగింది.

ఇక్కడే అసలు విషయం ఏమిటంటే ప్రభాస్ కు అధికారికంగా ఎలాంటి ట్విట్టర్ హ్యాండిల్ లేదు. దానిని అభిమానులే ఎప్పటి నుంచో మైంటైన్ చేస్తున్నారు. ఆ హ్యాండిల్ ను ఇప్పుడు ట్విట్టర్ లో సజెస్ట్ చెయ్యడం అందులోను మొదటి తెలుగు హీరో ప్రభాసే కావడం ప్యూర్ డార్లింగ్ క్రేజ్ వలనే అని అభిమానులు అంటున్నారు. సో ఇలా డార్లింగ్ కు మరో గ్రేట్ అచీవ్మెంట్ సొంతం అయ్యింది.

Exit mobile version