పుష్ప పై వస్తున్న ఆ పుకార్లలో నిజం లేదు

కొద్దిరోజులుగా అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప మూవీ హీరోయిన్స్ పై ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ రశ్మికతో పాటు మరో హీరోయిన్ గా నీవేదా థామస్ నటిస్తుందంటూ మీడియాలో కథనాలు రావడం జరిగింది. ఐతే ఈ పుకార్లలో నిజం లేదని చిత్ర నిర్మాతలు తెలియజేశారు. పుష్ప కథ ప్రకారం ఒక హీరోయిన్ కి మాత్రమే స్థానం ఉందని, రష్మిక మినహా మరో హీరోయిన్ నటించే అవకాశం లేదని స్పష్టత ఇచ్చారు.

అల్లు అర్జున్ సుకుమార్ ల హ్యాట్రిక్ మూవీగా వస్తున్న పుష్ప పాన్ ఇండియా మూవీగా పలు భాషలలో విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. రెండ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుండగా, బన్నీ లారీ డ్రైవర్ రోల్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా పుష్ప విడుదల కానుంది.

Exit mobile version