ఈ ఇద్దరు డెబ్యూ హీరోలు చాల దురదృష్టవంతులు..!

2020 ఇద్దరు డెబ్యూ హీరోలకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఎన్నో ఆశలతో హీరోగా మారి కస్టపడి సినిమా చేసి దానిని తెరపైన చూడాలి, ప్రేక్షకుల స్పందన తెలుసుకోవాలని ఆశపడిన వారిద్దరి కల అంతకంతకు దూరం అవుతుంది. వారే మెగా హీరో వైష్ణవ్ తేజ్, యాంకర్ ప్రదీప్. ఉప్పెన చిత్రంతో వైష్ణవ్ ఎంట్రీకి సర్వం సిద్ధం అయ్యింది. దర్శకుడు సనా బుచ్చి బాబు తెరకెక్కించిన ఈ మూవిపై మంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది. దేవిశ్రీ సాంగ్స్ జనాల్లోకి బాగా వెళ్లాయి. ఇక విజయం తధ్యం అనుకుంటున్న వేళ కరోనా లాక్ డౌన్ దెబ్బేసింది.

ఇక యాంకర్ నుండి హీరోగా మారిన ప్రదీప్ హీరోగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా చేశారు. ఈ మూవీపై కూడా మంచి అంచనాలున్నాయి. ఈ మూవీలో సిద్ శ్రీరామ్ పాడిన నీలి నీలి ఆకాశం సాంగ్ బంపర్ హిట్ అయ్యింది. ఇలా ఈ ఇద్దరు హీరోల డెబ్యూ మూవీలకు విడుదలకు ముందే పాజిటివ్ టాక్ వచ్చినా, కరోనా కారణంగా వాయిదాపడి ఇబ్బంది పడుతున్నారు.

Exit mobile version