త్రిష పరిశ్రమకి వచ్చి పదేళ్ళు దాటింది, మొదట సౌమ్యమయిన పాత్రల్లోనే కనిపించినా మెల్లగా గ్లామర్ పాళ్ళు పెంచుకుంటూ పరిశ్రమలో అగ్ర స్థానానికి చేరింది. ఇప్పటి వరకు చిత్రంలో హీరోతో సమానమయిన భూమిక ఉన్న చిత్రాలను చేసింది కాని లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చెయ్యలేదు. ఎప్పుడు వినోదాత్మక చిత్రాలకే పరిమితమయిన త్రిష పరిశ్రమలో తిరుగుతున్న సమాచారం ప్రకారం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను చెయ్యాలని అనుకుంటుందట. ఈ దిశగా ప్రయత్నాలు కూడా మొదలు పెట్టినట్టు, తమిళంలో ఒక చిత్ర రూపకల్పన కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. తెలుగులో కూడా ఒక అగ్ర నిర్మాత ఇలాంటి ఒక చిత్రాన్నే త్రిషతో చెయ్యాలని అనుకుంటూ ఉన్నారని సమాచారం. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో కూడా త్రిష సక్సెస్ కావాలని కోరుకుందాం.