ఆ ప్లాప్ డైరెక్టర్ కి అనుష్క ఆఫర్ ఇచ్చారట..!

సందీప్ కిషన్, రెజినా కాసాండ్రా జంటగా 2014లో వచ్చిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ రా రా కృష్ణయ్య అంతగా విజయం సాధించలేదు. దీనితో ఈ చిత్ర దర్శకుడు మహేష్ కి అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. కాగా ఆ చిత్రం విడుదలైన దాదాపు ఆరేళ్ళ తరువాత ఆయన అనుష్క శెట్టిని తన స్టోరీ లైన్ తో ఇంప్రెస్ చేశారట. దీనితో అనుష్క పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయండి సినిమా చేద్దాం అని ఆఫర్ ఇచ్చారట. మరి అనుష్క నుండి సినిమా చేద్దాం అని గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటే భారీ లక్ తగిలినట్టే.

ఇక అనుష్క నటించిన నిశ్శబ్దం మూవీ ఏప్రిల్ 2న విడుదల కానుంది. హార్రర్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీలో అనుష్క మూగదైన పెయింటింగ్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. మాధవన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి కోనా వెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. అంజలి, షాలిని పాండే కీలక రోల్స్ చేస్తున్నారు.

Exit mobile version