
శత్రువు, మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం,నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి హిట్ చిత్రాలను నిర్మించి మంచి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న ఎం.ఎస్. రాజు గత కొన్ని సంవత్సరాలుగా బాడ్ టైం ఎదుర్కొంటున్నాడు. పౌర్ణమి, ఆట, వాన, మస్కా ఇలా అన్ని సినిమాలు పరాజయం పాలవుతూ ఆయనని ఆర్ధిక నష్టాల్లోకి నెట్టాయి. ఇటీవలే తన కొడుకు సుమంత్ అశ్విన్ ని హీరోగా పరిచయం చేస్తూ స్వీయ దర్శకత్వంలో తీసిన తూనీగా తూనీగా కూడా ఫ్లాప్ అయింది. అయితే ఆయన తాజాగా ‘రమ్’ (RUM) సినిమా తీయబోతున్నట్లు సమాచారం. రమ్ అంటే రంభ, ఊర్వశి,మేనక పేర్లలోని మొదటి అక్షరాలను తీసుకొని రమ్ అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో రంభ, ఊర్వశి, మేనక లుగా త్రిష, అర్చన, పూర్ణ నటించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎం.ఎస్ రాజుకి ఈ సినిమాతో పూర్వ వైభవం తిరిగి రావాలని కోరుకుందాం.