
యశ్విన్ మరియు నిఖిత నారాయణ్ ప్రధాన పాత్రలలో రానున్న చిత్రం “మేడ్ ఇన్ వైజాగ్” చిత్ర పాటలను హైదరాబాద్లో విడుదల చేశారు. నిషా నేహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఉదయ శంకర్ ఆకెళ్ళ నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రానికి కన్మణి దర్శకత్వం వహిస్తున్నారు. ఒక హైదరాబాది అమ్మాయి వైజాగ్ వెళ్ళాక అక్కడ తన జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకున్నాయి అన్న అంశం మీద ఈ చిత్రం ఉండనుంది. ఈ ఆడియో విడుదల సందర్భంగా పాటలు ఎస్పీ బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ “పిచ్చి పిచ్చి మాటలు లేకుండా ప్రతి పదం అర్థమయ్యేలా పాటలున్నాయి, వైజాగ్ నగరంపై యడవల్లి రాసిన పాట చరిత్రలో నిలిచిపోతుంది” అని అన్నారు. ‘‘ముంబయ్-పూణె-ముంబయ్’ అనే మరాఠి చిత్రానికి రీమేక్ ఇది.