చిరు సినిమా రిమేక్ చేస్తున్న సల్మాన్ భాయ్?


ఒకరికి సాయం చేసి వారి నుంచి కృతఙ్ఞతలు ఆశించకుండా వారిని మరో ముగ్గురికి సాయం చెయ్యమని చెప్పే సందేశంతో, మెగాస్టార్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘స్టాలిన్’. ఎ.ఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో చిరంజీవి , త్రిష జంటగా నటించిన ఈ స్టాలిన్ సినిమా 2006లో విడుదలై అందరి ప్రశంశలు అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమాని హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా రీమేక్ చేయనున్నాడా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలు. మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా హిందీ వెర్షన్లో సల్మాన్ హీరోగా, సోహైల్ ఖాన్ డైరెక్ట్ చేయనున్నాడని సమాచారం. సల్మాన్ ఖాన్ వరుసగా సౌత్ ఇండియన్ సినిమాలు రీమేక్ చేస్తూ బాలీవుడ్లో బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు అవి పూర్తయిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.

Exit mobile version