దాసరి చెప్పే వరకు నేను నమ్మలేదు : చోటా కే నాయుడు


కలలు అందరూ కంటారు, వాటిని నిజం చేసుకునేది మాత్రం కొందరే. శ్రీనివాస్ రెడ్డి ఢమరుకం అనే పెద్ద కలని కని దానిని నిజం చేసుకున్నారు. శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్లో నాగార్జున, అనుష్క, రవిశంకర్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలుగా నటించిన ఢమరుకం గత శుక్రవారం విడుదలై మంచి కలెక్షన్లతో నడుస్తుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ సభ్యులు ఢమరుకం సక్సెస్ మీట్ జరుపుకున్నారు.

ఈ వేడుకలో చోటా కే నాయుడు మాట్లాడుతూ ‘ఢమరుకం హిట్ అని ఎంత పెద్ద హిట్ అయిందో ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఇండస్ట్రీకి వచ్చి 34 ఏళ్ళు అయింది. కెరీర్ మొదట్లో దాసరి నారాయణ రావు గారి దగ్గర 7 ఏళ్ళు పైగా చేశాను. ఇప్పటి వరకు 56 సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసాను. నిన్న దాసరి గారు నాకు ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నారు. సినిమా చూసాను చాలా అధ్బుతంగా చేసావు అని దగ్గరికి తీసుకుని మెచ్చుకున్నారు. ఆయనతో కలిసి భోజనం చేయమన్నారు. సినిమా గురించి చాలాసేపు మాట్లాడారు. నేను ఎన్నో సినిమాలకి పనిచేసినా అయన ఇంత మెచ్చుకోలేదు.అందరూ ఫోన్ చేసి సినిమా అంత హిట్ అయింది ఇంత హిట్ అయింది అంటే నమ్మలేదు. ఆయన చెప్పిన తరువాత నాకు సినిమా ఇంత పెద్ద హిట్ అయిందా అనిపించింది’ అన్నాడు.

నాగార్జున మాట్లాడుతూ ‘సినిమా విడుదలైన రెండో రోజు నుండే సంతలో కూరగాయలు అమ్మినట్లు ఈ సినిమా పైరసీ డీవీడీలు అమ్ముతున్నారు. పైరసీ కంట్రోల్ చేయడానికి నా ఫాన్స్ చాలా సహకరిస్తున్నారు. మీకు ఎక్కడైనా లింకులు కనపడితే antipiracy@nagfans.com ఈ మెయిల్ ఇడికి మెయిల్ చేయండి అన్నాడు’. అనుష్క మాట్లాడుతూ అరుంధతి సినిమా చేసినపుడు పశుపతిని చూసి ఇంతగా భయపడలేదు కానీ ఇందులో అంధకాసురుడుని చూసి మాత్రం చాలా భయపడ్డాడు. నాకు శివుడంటే చాలా ఇష్టం. ఈ సినిమాని శివుని భక్తురాలిగా భావించి చేశాను’

Exit mobile version