విజయ్ తో రొమాన్స్ స్టార్ట్ చేసిన అమలా పాల్


మలయాళీ ముద్దుగుమ్మ అమలా పాల్ చివరికి ఇలయతలపతి విజయ్ సరసన నటించే కొత్త సినిమా సెట్స్ లోకి అడుగుపెట్టింది. ఎ.ఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని చంద్ర ప్రకాష్ జైన్ నిర్మిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ టీంతో ఈ రోజు అమలా పాల్ కలిసింది. ‘ కొత్త స్కూల్లో నా మొదటి రోజు. ఇది నాకు ఎంతో ఇష్టమైన స్కూల్. కొత్త నటులతో పనిచేయడం ఎప్పుడూ కొంత భయంగానే ఉంటుందని’ అమలా పాల్ ట్వీట్ చేసారు. జి.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి నిరవ్ షా సినిమాటోగ్రాఫర్.

ఈ సినిమా ఎక్కువ భాగం ముంబై మరియు స్పెయిన్ లో చిత్రీకరణ జరుపుకోనుంది. గత కొన్ని రోజులుగా అమలా పాల్ సముద్రఖని డైరెక్షన్లో చెన్నైలో జరుగుతున్న ‘జెండా పై కపిరాజు’ షూటింగ్లో పాల్గొంది. త్వరలోనే విజయ్ సినిమా షెడ్యూల్ పూర్తి చేసుకొని రామ్ చరణ్ ‘నాయక్’ సినిమా షూటింగ్లో పాల్గొని తన మిగిలిన షూటింగ్ ని పూర్తి చేయనుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ ‘ఇద్దరమ్మాయిలతో’ షూటింగ్లో పాల్గొంటుంది.

Exit mobile version