“బస్ స్టాప్” చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టుతుంది. నవంబర్ 11న విడుదల అయిన ఈ చిత్రం ఇప్పటికి బాక్స్ ఆఫీస్ వద్ద బలమయిన వసూళ్లను రాబట్టుతుంది. ప్రిన్స్,శ్రీ దివ్య ప్రధాన పాత్రలలో దర్శకుడు మారుతీ తెరకెక్కించిన ఈ చిత్రం మొదటి రోజు నుండే నిర్మాత బెల్లంకొండ సురేష్ కి లాభాలు చేకూర్చింది. 1.75 కోట్లతో నిర్మితమయిన ఈ చిత్రం మొదటి రోజే అంతటి వసూళ్లను రాబట్టింది. లోబడ్జెట్ చిత్రాలలో భారీ విజయం సాదించిన మరో చిత్రం అయ్యింది. గత రెండు వారాల్లో విడుదలయిన భారీ బడ్జెట్ చిత్రాల పోటీలో కూడా ఈ చిత్రం వసూళ్లను రాబట్టడం నిజంగా ఆశ్చర్యకరమయిన విషయం. మారుతీ ప్రస్తుతం తన గీత ఆర్ట్స్ లో తను చెయ్యబోతున్న చిత్రం మరియు ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో రానున్న “ప్రేమకథ చిత్రమ్” కోసం పని చేస్తున్నారు.