లాంచనంగా ప్రారంభమైన నాగ్ ‘భాయ్’


‘కింగ్’ అక్కినేని నాగార్జున హీరోగా నటించనున్న ‘భాయ్’ సినిమా ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో లాంచనంగా ప్రారంభమైంది. పక్కా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి ‘పూలరంగడు’ డైరెక్టర్ వీరభద్రం చౌదరి డైరెక్ట్ చేస్తున్నాడు. నాగ్ సరసన తొలిసారి రిచా గంగోపాధ్యాయ హీరోయిన్ గా నటించనుంది. ఈ కార్యక్రమానికి ప్రొడక్షన్ టీంతో పాటు అమల కూడా హాజరయ్యారు.

నాగ్ ‘హలో బ్రదర్’ సినిమా లాగా పూర్తి మాస్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ చివరి వారం నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. సమ్మర్ రిలీజ్ కి ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా టీంకి గుడ్ లక్ చెబుతున్నాం.

Exit mobile version