బాల పరదేశికి అనూహ్య స్పందన


కొద్ది విరామం తరువాత దర్శకుడు బాల మరో ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు.”పరదేశి” అనే పేరుతో రానున్న ఈ చిత్రంలో అథర్వ, వేదిక మరియు ధన్సిక ప్రధాన పాత్రలు పోషించారు. 1940లో తమిళనాడులో టీ ఎస్టేట్ కార్మీకుల గురించి ఈ చిత్రం ఉండబోతుంది. ఈ చిత్రంలో ప్రధాన తారాగణం అంతా ఈ చిత్రం కోసం వేషధారణ మార్చుకున్నారు. బాల గతంలో చేసిన “శివపుత్రుడు”, “వాడు-వీడు” వంటి చిత్రాలలానే ఇది కూడా విభిన్న చిత్రం కానుంది. ఈరోజు ఈ చిత్ర ఆడియో చెన్నైలో విడుదల అయ్యింది. ఈ చిత్ర ట్రైలర్ ఇంటర్నెట్లోకి వచ్చాక ప్రేక్షకులను చాలా ఆకర్షించింది. చూసిన ప్రతి ఒక్కరు బాల దర్శకత్వంని ప్రశంసలలో ముంచెత్తారు. “వాడు-వీడు” చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పొందినా ఈ చిత్ర ఫస్ట్ లుక్ చూస్తే బాల ఈసారి హిట్ కొట్టేలా కనిపిస్తున్నారు. జి.వి ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 21న విడుదల కానుంది.

Exit mobile version