తెలుగు సినిమాల కోసం టైం లేదంటున్న భామ


తెలుగు, తమిళం మరియు హిందీ భాషల్లో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న మలయాళీ ముద్దుగుమ్మ అసిన్ ఈ మధ్యకాలంలో సౌత్ సినిమాలకంటే ఎక్కువ బాలీవుడ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది. ఇటీవల అసిన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలుగు సినిమా ఎప్పుడు చేస్తున్నారు అని అడిగితే ‘ ప్రస్తుతం వరుసగా హిందీ సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నాను. మరో రెండు సంవత్సరాలు వరకూ నా కాల్షీట్స్ కూడా ఖాళీ లేవు. నాకు ఓ తెలుగు సినిమా చేయాలనుంది కానీ ఇప్పుడు కాదని ‘ అసిన్ అన్నారు. ఇప్పటి వరకూ అసిన్ బాలీవుడ్లో చేసిన ‘గజిని’, ‘రెడీ’, ‘హౌస్ ఫుల్ 2’ మరియు ‘బోల్ బచ్చన్’ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్ల బార్డర్ క్రాస్ చేసాయి. ప్రస్తుతం ముంబైకి మకాం మార్చేసిన అసిన్ తెలుగులో చివరిగా పవన్ కళ్యాణ్ సరసన ‘అన్నవరం’ సినిమాలో కనిపించింది.

Exit mobile version