నూతన తారలతో ఆనంద రంగ కొత్త మూవీ


సిద్దార్థ్ తో ‘ఓయ్!’ సినిమా తీసిన ఆనంద్ రంగ తన తదుపరి సినిమా కోసం రంగం సిద్దం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి మరియు త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ‘ త్వరలోనే ప్రారంభం కానున్న నా కొత్త సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నా టీం మెంబర్స్ సినిమాటోగ్రాఫర్ విజయ్ కె. చక్రవర్తి మరియు ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ తో కలిసి పనిచేస్తున్నాను. కానీ యువన్ శంకర్ రాజ మాత్రం ఈ సారి మిస్ అవుతున్నాడు. ఈ సినిమాకి ‘ఇష్క్’ మంచి ట్యూన్స్ ఇస్తాడని అనూప్ రూబెన్స్ ని తీసుకున్నాను. అలాగే నా బ్రదర్స్ అనిల్ మరియు భాను కూడా సినిమాలో ఒక పార్ట్. ఈ సినిమాతో నూతన హీరో హీరోయిన్లను పరిచయం చేస్తున్నానని’ ఆనంద్ రంగ ట్వీట్ చేసాడు.

ప్రస్తుతం ఆనంద్ రంగ శంకర్ మార్తాండ్ డైరెక్టర్ గా చేస్తున్న ‘పొగ’ సినిమాని నిర్మిస్తున్నాడు. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలను నిర్మిస్తునాడు అవి కూడా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నాయి.

Exit mobile version