చెన్నై ముద్దుగుమ్మ త్రిష ఇప్పటి వరకూ పూర్తి గ్లామరస్ మరియు అభినయం ఉన్న పాత్రలు మాత్రమే చేసుకుంటూ గత 10 సంవత్సరాలుగా సౌత్ ఇండియన్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తోంది. ఈ మధ్య కాలంలో మునుపటికంటే సినిమా చాన్సులు తగ్గినా తనకున్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటివరకూ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయని త్రిష త్వరలోనే నాయికా ప్రాధాన్యం ఉన్న సినిమా చేయనుందా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలు. త్రిషకి తెలుగులో బ్రేక్ ఇచ్చిన ప్రొడ్యూసర్ ఎం.ఎస్ రాజు ఈ సినిమాని నిర్మించనున్నారని సమాచారం. ఈ చిత్ర పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. ఇప్పటి వరకూ గ్లామరస్ గా మెప్పించిన త్రిష నటిగా ఎన్ని మార్కులు తెచ్చుకుంటుందో వేచి చూడాలి.