ఆర్.ఎఫ్.సి లో చిందేస్తున్న అజయ్ – తమన్నా


మిల్క్ బ్యూటీ తమన్నా కొంత విరామం తర్వాత షూటింగ్లో పాల్గొంటోంది. బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తున్న ‘హిమ్మత్ వాలా’ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. కొద్ది రోజుల క్రితం వరకు ఈ మోవిఎర్ షూటింగ్ హైదరాబాద్లో జరుపుకుంది. ఆ తర్వాత ‘సన్ అఫ్ సర్దార్’ సినిమా ప్రమోషన్స్ లో అజయ్ దేవగణ్ బిజీ కావడంతో కొద్ది రోజులు ఈ సినిమా షూటింగ్ కి గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ మొదలైన ఈ చిత్ర చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. హీరో హీరోయిన్ మీద కొన్ని కీల సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షాజిద్ ఖాన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని వాసు భజ్ఞాని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా 1980ల్లో కె. రాఘవేంద్ర రావు డైరెక్షన్లో వచ్చిన ‘హిమ్మత్ వాలా’ మూవీకి రిమేక్. ఈ సినిమాలో హిట్ సాంగ్ ‘నైనన్ మెయిన్ సప్న’ పాటని రిమేక్ చేసారు. ఈ సినిమాలో తమన్నా చేసిన మొదటి షాట్ ఈ పాట కోసమే మరియు కిషోర్ కుమార్ కుమారుడు అమిత్ కుమారు ఈ రీమిక్స్ సాంగ్ ని పాడారు. ఈ సినిమా సెట్లో తమన్నాకి వ్రుత్తి పట్ల ఉన్న తపన మరియు గౌరవాన్ని చూసి ఎంతో మెచ్చుకున్నారు. ఈ సినిమా 2013లో విడుదల కానుంది.

Exit mobile version