తన రాబోతున్న తమిళ చిత్రం “సమర్” కి త్రిష తన సొంత గాత్రాన్ని అందిస్తుంది. తన పదేళ్ళ కెరీర్ లో ఇది నాలుగోసారి తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకోవడం. గతంలో మణిరత్నం “అయుథ ఎళుదు” చిత్రానికి, కమల్ హసన్ సరసన “మన్మధన్ అంబు” చితానికి మరియు అజిత్ సరసన “మంకాత” చిత్రానికి మాత్రమే త్రిష డబ్బింగ్ చెప్పింది. తన పాత్రకు సొంత డబ్బింగ్ చెప్పుకోడానికి ముఖ్య కారణం కమల్ హాసన్ అని త్రిష చెప్పింది. “మన్మధన్ అంబు” సమయంలో అయన నా పాత్రకు నన్ను డబ్బింగ్ చెప్పుకోమని ప్రోత్సహించారు దగ్గరుండి తప్పులను సరిదిద్ది సలహాలు ఇచ్చారు” అని త్రిష అన్నారు. విశాల్ ,త్రిష ప్రధాన పాత్రలలో రానున్న “సమర్” చిత్రం తెలుగులోకి కూడా అనువదించబడుతుంది. ఈ చిత్రం 2013 మొదట్లో విడుదల కానుంది.