యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా చేస్తున్న యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ‘బాద్షా’ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ మూవీలో ఎన్.టి.ఆర్ డాన్ గా నటిస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచే కామెడీ సూపర్ స్టార్ బ్రహ్మానందం ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్లో పాల్గొంటున్నాడు మరియు బ్రహ్మి ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాకి శ్రీను వైట్ల డైరెక్టర్ మరియు అన్ని శ్రీను వైట్ల సినిమాల్లోనూ బ్రహ్మానందం ఖచ్చితంగా ఒక కీలక పాత్ర చేస్తున్నారు.
ఈ చిత్ర కథా రచయితలు గోపి మోహన్ మరియు కోన వెంకట్ ‘బాద్షా’ లో బ్రహ్మానందం పోషిస్తున్న పాత్ర ఆయన కెరీర్లో బెస్ట్ గా నిలిచిపోతుందని అన్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ నిర్మిస్తున్న ‘బాద్షా’ 2013 సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.