కడల్ ఫస్ట్ లుక్ విడుదల


మణిరత్నం దర్శకత్వంలో రానున్న “కడల్ ” చిత్ర ఫస్ట్ లుక్ ని ఈరోజు విడుదల చేశారు ప్రముఖ హీరో కార్తీక్ కొడుకు గౌతం మరియు రాధ చిన్న కూతురు తులసి ఈ చిత్రంతో తెరకు పరిచయం కానున్నారు. ఇప్పటి వరకు వీరిని మణిరత్నం బయట కనపడనివ్వలేదు ఈరోజు విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో కూడా గౌతం మొహం కనపడకుండా జాగ్రత్తపడ్డారు. తెలుగులో ఈ చిత్రం “కడలి” అనే పేరుతో విడుదల కానుంది ఈ చిత్రంలో అరవింద్ స్వామి మరియు లక్ష్మి మంచు కీలక పాత్రలు పోషించనున్నారు. MTV లో విడుదల చేసిన ‘నెంజికుల్లె’ పాట అంతర్జాలంలో అద్భుతమయిన విజయం సాదించింది. ఏ ఆర్ రెహమాన్ అందించిన సంగీతం త్వరలో విడుదల కానుంది. రాజీవ్ మీనన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. దక్షిణ తమిళనాడులో ఒక పల్లెలో యువ జాలర్ల మధ్యన జరిగే ప్రేమకథగా ఈ చిత్రం ఉండబోతుంది. ఈ చిత్రం ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది 2013 మొదట్లో ఈ చిత్రం విడుదల కానుంది.

Exit mobile version