యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య 8వ సినిమాకి రంగం సిద్ధమైంది. నాగార్జునతో ఢమరుకం వంటి సోషియో ఫాంటసీ భారీ సినిమా తీసిన శ్రీనివాస్ రెడ్డి తన నెక్స్ట్ సినిమా నాగ చైతన్యతో చేయబోతున్నాడు. ఢమరుకం సినిమా చుసిన తరువాత శ్రీనివాస్ రెడ్డి పనితనానికి బాగా ఇంప్రెస్ అయిన నాగార్జున వెంటనే నాగ చైతన్య సినిమాని డైరెక్ట్ చేసే అవకశం ఇచ్చారు. గతంలో కామాక్షి మూవీస్ బ్యానర్ పై నాగార్జునతో ఎన్నో సినిమాలు నిర్మించిన డి శివప్రసాద్ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. గతంలో నాగ చైతన్య హీరోగా వచ్చిన దడ సినిమాని శివప్రసాద్ రెడ్డి నిర్మించారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. చైతన్య ప్రస్తుతం ఆటో నగర్ సూర్య, వెట్టై రీమేక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా ఆటో నగర్ సూర్య ఫస్ట్ లుక్ టీజర్, పోస్టర్స్, స్టిల్స్ ఈ రోజే విడుదల చేసారు.