డా. మోహన్ బాబు రోజూ తినడానికి తిండి ఉంటే చాలు అని సినీ ఇండస్ట్రీలో అసిస్టెంట్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత నటుడిగా, విలన్ గా, నిర్మాతగా మరియు హీరోగా ఎదిగి తెలుగు ప్రేక్షకుల చేత కలెక్షన్ కింగ్ అని పిలుచుకునే స్థాయికి ఎదిగారు. ఇలా మోహన్ బాబు సినీ కెరీర్ ప్రారభించి నేటితో 37 వసంతాలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా తెలుగు కళామ్మ తల్లితో ఆయనకున్న అనుబందాన్ని మరియు ఆనందాన్ని తెలుపడం కోసం పత్రికా విలేకరులతో ముచ్చటించారు. ‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి 37 సంవత్సరాల నుండి నటుడిగా కొనసాగుతున్నందుకు చాలా అందంగా ఉంది. ఈ సందర్భంగా దీనంతటికీ కారణమైన మా గురువు దాసరి నారాయణ రావు గారికి నా కృతఙ్ఞతలు’ తెలిపారు. భవిష్యత్తులో డైరెక్షన్ చేసే అవకాశం ఏమన్నా ఉందా అని అడిగితే ఆయన కింది విధంగా స్పందించారు.
‘ నా కెరీర్ నాకు డైరెక్షన్ చేయగల అనుభవం నేర్పించింది. సినిమా డైరెక్షన్ చేయాలనుకున్నా కానీ ఖచ్చితంగా ఆ సినిమా మొదలైన రెండు రోజులకే ఆగిపోతుంది అనే ఉద్దేశంతో చేయడం లేదు. ఎందుకంటే సినిమాకి పని చేసే అందరిలోనూ నాలాగే టైమింగ్ మరియు క్రమశిక్షణ ఉండాలంటాను. ఆ విషయాల్లో అంత నిక్కచ్చిగా ఉంటే ఇబ్బందులు వచ్చి సినిమా ఆగిపోతుందని’ మోహన్ బాబు అన్నారు. అలాగే మాట్లాడుతూ ‘ దాదాపు 7 సంవత్సరాల గ్యాప్ తర్వాత సోలో హీరోగా ఓ సినిమా చేయనున్నాను. పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాను. ఆ మూవీ తర్వాత ‘రావణ’ ఉంటుందని’ తెలిపారు.
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 37 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డా. మోహన్ బాబుకి 123తెలుగు.కామ్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.