డిస్కో రాజ దర్శకుడు వి ఐ ఆనంద్ ఫోన్ చేస్తే…నాతో నీకేంపని అన్నాడట రవితేజ. ఈ విషయాన్ని స్వయంగా రవితేజ ఓ టీవీ కార్యక్రమంలో చెప్పారు. వి ఐ ఆనంద్ గతంలో ఎక్కడికిపోతావు చిన్నవాడా, ఒక్క క్షణం వంటి వైవిధ్యమైన చిత్రాలు చేశారు. అలాంటి సినిమాలు చేసిన డైరెక్టర్ కి నాతో ఏమి పని ఉంటుందని భావించిన రవితేజ దర్శకుడితో అలా అన్నారట. నా ఇమేజ్ కి మీ టేకింగ్ కి సంబంధం ఉండదు కదా, మీరు నాకు ఫోన్ చేయడమేంటనే అర్థంలో రవి తేజ దర్శకుడు ఆనంద్ తో అన్నారట. ఈ విషయాన్ని డిస్కో రాజా ప్రొమోషనల్ కార్యక్రమంలో రవితేజ సరదాగా చెప్పారు.
ఈనెల 24న డిస్కో రాజా విడుదల కానుంది దీనితో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేశారు. రెండు రోజుల క్రితం చిత్ర టీజర్ 2 విడుదల చేశారు. అలాగే చిత్ర యూనిట్ సభ్యులు టివీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాభా నటేష్, పాయల్ రాజ్ పుత్, తాన్యా హోప్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.