శివాజీ 3D చిత్ర విడుదల తేదీ ఖరారు

రజినీకాంత్ ప్రధాన పాత్రలో “వచ్చిన శివాజీ చిత్రాన్ని 3D లో విడుదల చెయ్యడానికి సిద్దమయ్యింది. చాలా కాలంగా ఏవియం సంస్థ చిత్రాన్ని 3Dలోకి మారుస్తూ వచ్చింది ఈ ఏడాది మొదట్లో విలేఖర్ల కోసం నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. అక్కడ విమర్శకులందరు ఇది కొత్త అనుభూతి అన్ని చెప్పడంతో ఏవియం సంస్థ వారు ధీమాగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి సిద్దమయ్యారు. ఈ చిత్రం రజినీకాంత్ పుట్టినరోజు అయిన 12-12-12 న విడుదల చేయ్యనున్నట్లు సమాచారం. శ్రియ ఈ చిత్రంలో రజినీకాంత్ సరసన నటించగా సుమన్ ప్రతినాయక పాత్రలో కనిపించారు. శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు “మగధీర” బద్దలు కొట్టేంతవరకు దక్షిణ భారతదేశంలో రికార్డులన్ని ఈ చిత్రం మీదనే ఉన్నాయి. ఏ ఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇదిలా ఉండగా రజినీకాంత్ తరువాత చిత్రం “విక్రం సిన్ఘ” 2013 వేశావికి వాయిదా వేశారు. శంకర్ ప్రస్తుతం విక్రం హీరోగా “మనోహరుడు చిత్రీకరణ కోసం చైనాలో ఉన్నారు.

Exit mobile version